ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:24 IST)

లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటం.. ఆ ఇద్దరికి నోబెల్ పురస్కారం

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్న వేళ లైంగిక హింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి అవార్డు దక్కింది.

హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ప్రభావం.. ప్రపంచ దేశాలకు పాకిన నేపథ్యంలో.. బాలీవుడ్‌లోనూ మీటూపై చర్చ మొదలైంది. అలాగే భారత్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పలువురు స్పందిస్తున్నారు. 
 
ఇదో వైపు జరుగుతున్న దేశంలో అత్యాచారాలు, లైంగిక నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో కాంగో దేశానికి చెందిన డెన్నిస్ ముక్వెగెతో పాటు యాజిది వర్గానికి చెందిన అత్యాచార బాధితురాలు నదియా మురాద్‌లకు నోబెల్ అవార్డు దక్కింది. ఫిజియన్ అయిన డెన్నిస్ లైంగిక దాడుల బాధితులైన వేలాది మందిని ఆదుకున్నారు. 
 
కాంగోలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన బాధితులకు అండగా ఉండి పోరాటాలు చేశారు. ఈ  నోబెల్ శాంతి అవార్డును పంచుకున్న నదియా మురాద్ ఓ అత్యాచార బాధితురాలు. తన వంటి బాధితుల తరపున ఆమె అనేక పోరాటాలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై 23 ఏళ్ల వయస్సులోనే ఆమె ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించారు.