శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (14:51 IST)

బుచాలో శవాల గుట్ట.. సామూహిక అత్యాచారాలు జరిగాయా?

Russia
ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 30 కిమీ దూరంలో ఉన్న బుచా నగరంపై రష్యా విరుచుకుపడిన తీరుకు నిదర్శనంగా 410 మృతదేహాలు కనిపించాయి. 
 
వీధుల్లో దొరికిన చాలా మృతదేహాలను చూస్తే ప్రజల్ని నేలపై పడుకోబెట్టి, చేతుల్ని వెనక్కి కట్టి తలవెనక భాగాన కాల్చినట్లు తెలుస్తోందని మేయర్‌ అనతోలి ఫెడొరక్‌ చెప్పారు.
 
బుచాలో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పంటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. ఇంతటి మారణహోమానికి రష్యానే కారణమని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
 
రష్యా నుంచి మార్చి 31న ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. ధ్వంసమైన రష్యా యుద్ధ ట్యాంకులతో అక్కడి వీధులు బీభత్సంగా కనిపిస్తున్నాయి.
 
ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఇదంతా కీవ్‌ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు రష్యాను రెచ్చగొట్టడానికి కీవ్‌ నుంచి వెలువడుతున్న సంకేతాలే అని పేర్కొంది. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదని పేర్కొంది.