శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (11:06 IST)

పాకిస్థాన్‌లో భూకంపం.. తొమ్మిది మంది మృతి.. 160 మంది గాయాలు

earthquake
పాకిస్థాన్‌లో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5పాయింట్లుగా నమోదైంది. భూకంపం కారణంగా తొమ్మిది మంది చనిపోయారని, మరో 160 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
మంగళవారం రాత్రిపూట భూమి కంపించడంతో పాక్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాత్ సిటీలలో భూమి కంపించింది. పలుచోట్ల భవనాలు నేల కూలాయి. 
 
మరోవైపు, ఆఫ్ఘానిస్తాన్, భారత్, తుర్కెమెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలలో కూడా భూకంప ప్రభావం కనిపించిందని ఇంటర్నేషనల్ సిస్మలాజికల్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని జనం భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాక్, ఆఫ్ఘాన్‌లలో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌లోనూ కనిపించింది.