మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (11:28 IST)

న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

earthquake
న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేయబడినట్లు సమాచారం. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవిలో గురువారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లో ప్రతి సంవత్సరం వేలాది భూకంపాలు సంభవిస్తాయి.
 
ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరిక కూడా జారీ చేసినట్లు సమాచారం. న్యూజిలాండ్ తీరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే అదే సమయంలో ఈ భూకంపం సంభవించిన ప్రాంతానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఎవరూ నివసించకపోవడం కూడా గమనార్హం.