1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 మే 2025 (15:17 IST)

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

attari - wagah border
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో తమతమ దేశాల్లో ఉన్న భారత్, పాక్ పౌరులు తక్షణం స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేస్తూ గడువు విధించాయి. ఈ గడువు ముగియగానే ఇరు దేశాలు తమతమ దేశాల్లోని సరిహద్దులను మూసివేశాయి. ఈ నేపథ్యంలో అట్టారీ - వాఘా సరిహద్దును పాకిస్థాన్ తిరిగి తెరిచింది. 
 
భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది. దీంతో బోర్డరులో చిక్కుకునిపోయిన చాలా మంది పాక్ జాతీయులు శుక్రవారం ఉదయం తమ దేశంలోకి అడుగుపెట్టారు. గురువారం నాడు సరిహద్దును మూసివేయడంతో అనేక మంది పాకిస్థానీయులు భారతదేశం వైపు చిక్కుకునిపోయారు. 
 
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వివిధ విసాలపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ ఇరు దేశాలు ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. దానికి డెడ్‌లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దులను మూసివేసింది. 
 
కాగా, బుధవారం 125 మంది పాకిస్థానీయులు అట్టారీ - వాఘా సరిహద్దు వద్ద భారత్‌ను విడిచి పాక్ భూభాగంలో అడుగుపెట్టారు. దీంతో ఆంక్షలు విధించి ఏప్రిల్ 24వ తర్వాత నుంచి ఏడు రోజులలో భారత్‌ను వీడిన పాక్ పౌరుల సంఖ్య 911కి చేరుకుంది.