శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:24 IST)

పెంపుడు జంతువులకు కరోనా వస్తే ప్రమాదం లేదు

cats
పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ సోకిందనేందుకు ఆధఆరాలు లేవని వైద్యులు అంటున్నారు. ఇంకా జంతువులను పెంచుకుంటున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.
 
పెంపుడు జంతువులకు వాటి యాజమాని లేక ఇతర మనుషుల ద్వారా వైరస్‌ సోకుతుందని తెలిపారు. ఈ జంతువులను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా తెలిపింది.
 
ఈ నేపథ్యంలో హాంకాంగ్‌లో ఓ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. యజమాని వల్లే పిల్లికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే హాంకాంగ్‌లో రెండు శునకాలకు కరోనా సోకింది. జంతువులకు కరోనా సోకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని వైద్యులు తెలిపారు.