ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (09:16 IST)

కాంగోలో కుప్పకూలిన కార్గో విమానం.. ఐదుగురు మృతి

Plane crash
కాంగోలో ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. చిన్న కార్గో విమానం మినిమియా నుంచి బుకావు వెళ్తుతుండగా దక్షిణ కివూ ప్రావిన్సు పరిధిలోని దట్టమైన అడవుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంపై అమెరికన్ మిషన్ బృందం దర్యాప్తు చేస్తుందని కాంగో మంత్రి తెలిపారు. 
 
అయితే, విమాన సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కాంగోలో తరుచూ విమాన ప్రమాదాలకు కారణమని అధికారులు చెప్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే కారణంతో యూపర్‌లో కాంగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇంతకుముందు దక్షిణ కివులోని ఏజ్‌ఫ్రెకోకు చెందిన అంటోనోవ్ విమానం 28 జనవరి 30 న కుప్పకూలింది. ఈ ఘటనలో కూడా ఐదుగురు మరణించారు.