కోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్

Kozhikode plane crash
వి| Last Modified శుక్రవారం, 14 ఆగస్టు 2020 (23:13 IST)
కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేబుల్ టాప్ వంటి ఆ విమానశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 18 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

విమానంలో చిక్కుకొని పోయిన వారిని వెలికి తీసేందుకు దాదాపు 3 గంటలకు పైగా సమయం పట్టింది. మరో వైపు రెస్క్యూ ఆఫరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యులు తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత వీరిని క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులతో పాటు దాదాపు 600 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. వీరిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారనే విషయంపై జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :