బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (11:27 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. దేశంలో రెండో స్థానానికి ఏపీ

దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఏపీ రెండోస్థానానికి చేరుకుంది. ఏపీలో మొత్తం 90,425 మంది కరోనా వైరస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. తొలిస్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది. ఇక్కడ 1,48,313 కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
మహారాష్ట్రలో ఇప్పటిదాకా 5,48,313 కేసులు నమోదు అయ్యాయి. ఆ ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. బుధవారం నాటి బులెటిన్ ప్రకారం మహారాష్ట్రంలో 12,712 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. 344 మంది మరణించారు. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 18,650కి పెరిగింది.
 
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడమే తప్ప తగ్గడం అనే మాట ఎత్తడం లేదు. రోజుకి సగటున రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బుధవారం నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,931 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86,475కి పెరిగింది. బుధవారం ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 11మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 665 కరోనా మరణాలు సంభవించాయి. బుధవారం ఒక్కరోజే 1,780 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 63,074కి చేరింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వారిలో 15,621 మంది ఇంట్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా టెస్టుల విషయానికి వస్తే.. బుధవారం ఒక్కరోజే 23,303 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,89,150 కరోనా టెస్టులు చేశారు.