మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (11:07 IST)

చక్రబంధంలో రష్యా - కీలక డిక్రీపై వ్లాదిమిర్ పుతిన్ సంతకం

ప్రపంచ దేశాల వినతులను తోసిరాజని ఉక్రెయిన్‌పై ఏకపక్ష దాడులకు దిగిన రష్యా ఇపుడు చక్రబంధంలో చిక్కుకుంది. ఆ దేశంపై అనేక రకాలైన ఆర్థిక ఆంక్షలను పలు దేశాలు విధిస్తున్నాయి. దీంతో రష్యా అధినేత పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
అనేక దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్ కీలక డిక్రీపై సంతకం చేసినట్టు 'ది కీవ్ ఇండిపెండెంట్' అనే ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. 
 
ఈ డిక్రీ ప్రకారం 10 లేల డాలర్లకు మించిన విదేశీ కరెన్సీతో రష్యన్లు దేశం దాటకుండా ఈ డిక్రీ అడ్డుకుంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా పరిగణిస్తూ అమెరికా దాని మిత్ర దేశాలు, యూరోపియిన్ యూనియన్, ఇతర దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుందని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది.