బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (12:11 IST)

జనాభాను పెంచేందుకు రష్యాలో శృంగారపు మంత్రి

putin
తమ దేశంలో జనాభాను పెంచేందుకు వీలుగా రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా శృంగారపు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలికాలంలో చైనా దేశంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. పైగా, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలంటూ చైనా ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇపుడు ఇదే పంథాను రష్యా కూడా ఎంచుకుంది. ఒక అడుగు ముందుకేసి ప్రత్యేకంగా శృంగారపు మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరుతో ఈ శాఖను నెలకొల్పేందుకు సీరియస్‌గా ఆలోచన చేస్తుంది. 
 
మరి.. ఈ శాఖలో భాగంగా ఏంచేస్తారు? అంటే.. పెళ్లైన జంటలు అధిక సమయం ఏకాంతంగా గడిపేలా ప్రోత్సహిస్తారు. ఇందుకు రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ఇంట్లో లైట్లు, ఇంటర్నెట్ బంద్ చేయాలని, ఇంట్లో ఉండే మహిళలకు జీతం ఇవ్వాలని, కొత్త జంటలు ఫస్ట్ నైట్‌కు0 హోటల్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి. ఇక పని ప్రదేశాల్లో లంచ్, కాఫీ విరామ సమావేశాలను కూడా సంతానోత్పత్తి బ్రేక్‌‍లుగా వినియోగించుకోవాలన్నది మరో ఆసక్తికరమైన ప్రతిపాదనగా ఉంది