శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (18:33 IST)

షెడ్యూల్ ప్రకారమే ఎస్​-400 క్షిపణులు: పుతిన్

ఎస్​-400 క్షిపణులను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్​కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదంటూ ఇంతకుముందు భారత్​ను అమెరికా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఎస్​-400 కొనుగోలుకే నిర్ణయించుకున్నట్లు సమాధానమిచ్చిన భారత్​.. రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.​ మరికొంతకాలంలో భారత అమ్ములపొదిల ఈ అత్యాధునిక క్షిపణులు చేరనున్నాయి.

భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఎస్-400 క్షిపణులను షెడ్యూల్ ప్రకారమే భారత్​కు అందించేందుకు యోచిస్తున్నామని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

రష్యా నుంచి ఎస్​-400 క్షిపణులను కొనుగోలు వద్దంటూ ఒప్పందానికి ముందు భారత్​ను అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారమే ఎస్​-400 అందించనున్నామని ప్రకటన చేశారు పుతిన్.