శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (09:26 IST)

మున్ముందు అగ్నిగుండమే... 2027 నాటికి ఉష్ణోగ్రతలో మరింత పెరుగుల

temperature
వచ్చే ఐదేళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా భూతాపం మరింతగా పెరిగిపోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్‌) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుందని తెలిపింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు. 
 
అయితే, ఏ ఒక్క ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేక పోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్‌నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక బుధవారం హెచ్చరించింది. 
 
వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం. ఎల్‌నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు.