బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (07:20 IST)

అమెరికాలో వింత పాము!

పాము జాతికి చెందిన ఓ వింతైన పాము అమెరికాలో కనిపించింది. పాముకి రెండు తలలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ పాముకి అర్థచంద్రాకారంలో రెండు తలలు ఒకేలా వున్నాయి.

ఈ పాము పది నుంచి పన్నెండు అంగుళాల పొడుగున్నట్లుగా వన్యప్రాణి నిర్వహణ సంస్థ గుర్తించింది. ఎవరైనా ఈ పామును ఎక్కడైనా చూశారా? ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలంటూ... ఫేస్‌బుక్‌లో వన్యప్రాణి సంస్థ ఈ పాము గురించి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇది ఆగ్నేయాసియాకు చెందిన పాము జాతికి చెందిన హామర్‌ హెడ్‌ పురుగుగా ఆ సంస్థ గుర్తించినట్లు, ఇటువంటి పురుగులను చంపడం కష్టమని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.

వన్యప్రాణి నిర్వహణ సంస్థ చేసిన ఈ రెండు పోస్టులపై అనేకమంది నెటిజన్లు స్పందించారు. దీనిని షోవెల్‌ హెడ్‌ వార్మ్‌ లేదా హామర్‌ హెడ్‌ వార్మ్‌ అని పిలుస్తారు.