సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (13:17 IST)

ఆప్ఘనిస్థాన్ కొత్త అధ్యక్షుడుగా బరాదర్ - ఆష్రఫ్ ఘనీ కోసం గాలింపు

ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్త అధ్యక్షుడుగా ముల్లా బరాదర్‌ ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఘనీ ఆప్ఘాన్‌ను వదిలిపారిపోయారు. అయితే అష్రఫ్‌ ఘనీ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ తాటిబన్‌ ప్రతి నిధులు ప్రకటన కూడా జారీ చేశారు. అదేసమయంలో ఆప్ఘన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తమ అధ్యక్షుడిగా బరాదర్‌ వ్యవహరిస్తామని ప్రకటించారు.
 
తాలిబన్ల రాజ్యం ఏర్పడటంతో వివిధ దేశాలు రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. తమ సిబ్బందిని తీసుకు రావడానికి మూడు వేల మంది అదనపు బలగాలను పంపించింది. ఇక భారత్‌ కూడా భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. 
 
ఆదివారం మధ్యాహ్నం 12.45కు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం... 129 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.35 భారత్‌‌కు తిరిగి వచ్చింది. ఇక అటు కాబూల్‌‌లో తాలిబన్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి రవాణా రాకపోకలను నిలిపివేస్తున్నాయి.