ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (09:04 IST)

అమెరికాలో తప్పిపోయిన తెలుగు విద్యార్థిని..

Telugu Female Student
Telugu Female Student
అమెరికాలో తెలుగు విద్యార్థులకు భద్రత కరువైంది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు తెలుగు విద్యార్థులను వెంటాడుతుంటే.. తాజాగా లాస్ ఏంజెల్స్‌లో భారతీయ విద్యార్థి నితీషా కందుల తప్పిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
తప్పిపోయిన విద్యార్థిని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతూ వచ్చింది. సాయం కోసం అభ్యర్థిస్తూ వాట్సాప్ ద్వారా ఫార్వార్డ్ చేస్తుంది. 
 
గత శుక్రవారం రాత్రి (అమెరికా కాలమానం) నుండి ఆమె తప్పిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన నితీషా కుటుంబ సభ్యులు సహాయం కోసం అభ్యర్థిస్తున్నారు.