శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (13:57 IST)

చంద్రయాన్ -3పై చైనా సైంటిస్ట్ ఏమంటున్నాడు..?

Chandrayaan 3
ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి, ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే. పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది. 
 
చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది. చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు. చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించి చైనాలో పితామహుడిగా పేరొందిన శాస్త్రవేత్త ఒయాంజ్ జియూన్ భారత్ చంద్రయాన్-3పై స్పందించారు. 
 
చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశం దక్షిణ అక్షాంశంలో 69 డిగ్రీల వద్ద ఉందన్నారు. చంద్రయాన్ -3 అనేది దక్షిణ ధ్రువానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు జియూన్ చెప్పారు. 
 
దీనిపై ఇస్రో ఇంకా స్పందించలేదు. అసలు భారత చంద్రయాన్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో, దక్షిణ ధ్రువానికి సమీపంలోనే లేదని చైనీ పత్రిక సైన్స్ టైమ్స్‌కు చెప్పారు.