ఒక రోజు కాదు.. ఏకంగా 14 నెలలు మూత్ర విసర్జన చేయలేక..?
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 14 నెలలు ఓ మహిళ మూత్ర విసర్జన చేయలేక నానా తంటాలు పడింది. ఆమె ఎల్లీ ఆడమ్స్ ఓ కంటెంట్ క్రియేటర్. కొద్ది నెలల క్రితం ఆమెకు మూత్రం రావడం ఆగిపోయింది. మూత్ర విసర్జన చేయాలపిస్తున్నా కుదరని పరిస్థితి.
తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆమె చివరకు వైద్యులను ఆశ్రయించింది. వివిధ పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెకు తక్షణ ఉపశమనం కోసం ట్యూబ్ ద్వారా మూత్రాశయంలో పేరుకుపోయిన మూత్రాన్ని తొలగించారు.
ఇంకా ఫౌలర్స్ సిండ్రోమ్ అనే వ్యాధితో ఆడమ్స్ బాధపడుతున్నట్టు చివరకు వైద్యులు తేల్చారు. ఈ సమస్య ఉన్న వారు సజావుగా మూత్ర విసర్జన చేయలేరు. వైద్యులు చివరి ప్రయత్నంగా మూత్రవిసర్జనకు కారణమయ్యే నాడులను ప్రేరేపించేందుకు వెన్నుముక కింద ఓ చిన్న పరికరాన్ని అమర్చారు వైద్యులు. దీంతో మహిళకు కాస్తంత ఉపశమనం లభించింది.
అయితే ఇది జీవితాంతం ఆమెకు ఉపయోగపడదని వైద్యులు అంటున్నారు. అయితే ఆమె మాత్రం ఈ సమస్య నుంచి ప్రస్తుతం గట్టెక్కడమే పెద్ద విషయమని.. అదృష్టవంతురాలని చెప్పుకొచ్చింది.