సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (16:50 IST)

యూఎన్ కారులోనే శృంగారం.. షాకైన ఐరాస.. ఎరుపు రంగు దుస్తుల్లో..?

శృంగారం విచ్చలవిడిగా జరుగుతోంది. నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ తంతు.. ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ జరుగుతోంది. ఇజ్రాయేల్‌లో కారులోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అదీ ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్య సమితికి చెందిన అధికారిక కారులో ఓ జంట శృగారం కొనసాగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ విషయం తెలిసి షాకైన ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్‌విజన్ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌టీఎస్ఓ)కు చెందిన సిబ్బంది ఇలాంటి ఘటనకు పాల్పడటం పట్ల ఐక్యరాజ్యసమితి షాకైంది. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టామని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఎరుపు రంగు దుస్తుల్లో వున్న ఓ మహిళ.. కారు వెనుక సీట్లో ఉన్న వ్యక్తి ఒడిలో కూర్చొని శృంగారానికి పాల్పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. టెల్ అవీవ్ నగరంలోని ఓ ప్రధాన మార్గంలో కారు కదులుతున్నప్పటికీ వారిద్దరూ రాసలీలల్లో మునిగి తేలారు. కారు నంబర్ ప్లేట్, దాని పై భాగాన యూఎన్ అనే అక్షరాలు కనిపించాయి.