శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (12:41 IST)

డెల్టాతో వణికిపోతున్న అగ్రరాజ్యం అమెరికా

అగ్రరాజ్యం అమెరికా డెల్టా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. గత పది రోజులుగా ఇక్కడ రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైదం. పది రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రెట్టింపు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. 
 
ప్రజలంతా వీలైనంత తొందరగా టీకా తీసుకోవాలని కోరారు. రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి విజృంభిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో భవిష్యత్​లో కరోనా వల్ల కలిగే ఇబ్బంది మరింత తీవ్రమవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 'డెల్టా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి' అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు