సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (09:37 IST)

నార్త్ కరోలినాలో తుపాకీతో రెచ్చిపోయిన దండగుడు.. ఐదుగురు కాల్చివేత

shoot
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఓ దండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. అతను జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉండటం గమనార్హం. 
 
నార్త్ కరోలినాలోని న్యూస్ రివర్ గ్రీన్‌వే సమీపంలో ఓ యువకుడు తుపాకీ చేతపట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కాల్పులు జరిపిన ఉన్మాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.