సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (14:59 IST)

మెటల్ బాక్సుల్లో గర్భిణీలు.. చైనా పాడుబుద్ధి మారదా?

కరోనాను పుట్టించి అపఖ్యాతిని మూటగట్టుకున్న చైనా మళ్లీ మళ్లీ తన పాడుబుద్ధితో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కరోనా రోగులను ఇనుప డబ్బాల్లో నిర్భంధిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్‌ బాక్స్‌ల వరుసలు కనిపిస్తున్నాయి. 
 
దారుణం ఏంటంటే మెట‌ల్ బాక్సుల్లో ప్రెగ్నెంట్ మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్ధుల‌ను బంధిస్తున్నారు. ఈ బాక్సుల్లో ఓ ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ ఉంటుంది. దాదాపు రెండు వారాల పాటు వారు ఆ చిన్న పెట్టెల్లో ఉండేలా నిర్భంధిస్తోంది. ఇలా కరోనా రోగుల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. వృద్ధులు, గర్భిణీ మహిళలకే కాకుండా కరోనా రోగులను ఇలా బాక్సుల్లో నిర్భంధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. 
 
కాగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి చేయ‌డం కోసం చైనా దేశంలో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది చైనా. ఒక్క కేసు వ‌చ్చినా.. ఆ ప‌ట్ట‌ణం మొత్తం లాక్‌డౌన్ విధిస్తోంది.