శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:09 IST)

వచ్చే 72 గంటలు అత్యంత కీలకం.. ఏమైనా జరగొచ్చు : పాకిస్థాన్

భారత వైమానిక దళం దాడులను పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ దాడులకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే మంత్రి ఖాజా రఫీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగొచ్చన్నారు. ఒకటి యుద్ధమా? లేదా శాంతి? అనేది 72 గంటల్లో తేలుతుందన్నారు. 
 
ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా భీకరంగా ఉంటుందని ఈ పాక్ మంత్రి అన్నాడు. పైగా, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇదే చివరి యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధవిమానాలతో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వెయ్యి కేజీల ఆర్డీఎక్స్‌ను వేయడంతో.. క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మంది పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.