మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (07:57 IST)

ఇలాగైతే ప్రజల ప్రాణాలు అంతే సంగతులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

చాలా దేశాలు కరోనా వైరస్ నిబంధనలు అతిక్రమిస్తున్నాయని, ప్రజలు కూడా చాల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డబ్ల్యూ హెచ్ వో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నామని లాక్‌డౌన్ ఎత్తివేసి తమ కార్య కలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. ఇది మరింత ప్రమాదం అని, ఇలా అయితే కరోనావైరస్ ప్రజలను పొట్టనబెట్టుకోవడం ఖాయం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో అయితే అన్‌లాక్ చేసినప్పటి నుండి కేసుల సంఖ్య, మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కనిపించని శతృవుపై విజయం సాధించడం అసాధ్యమని, పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానమ్ గెబ్రేసస్ హెచ్చరించారు. ప్రజల తీరుతో కరోనా మరింత ప్రమాదంలో పడేస్తుందని డబ్ల్యూహెచ్ఓ వ్యక్తం చేశారు.