సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (18:21 IST)

రానా, సందీప్‌, తేజ్‌తో ఈవెనింగ్ పార్టీలకు వెళుతుంటా... రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ

మహిళలను గౌరవిస్తాం అంటూ ఉమెన్స్‌డే, మదర్స్‌ డే, డాటర్స్‌ డే అంటూ ఏదో పేరుతో మహిళకు అగ్రస్థానం ఇస్తామంటూ.. పబ్లిసిటీ చేస్తుంటారేకానీ.. వారికి సరైన న్యాయం జరగడంలేదని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంటోంది. నటి భావన కిడ్నాప్‌ ఉదంతంపై ఆమె పైవిధంగా స్పందించింది.

మహిళలను గౌరవిస్తాం అంటూ ఉమెన్స్‌డే, మదర్స్‌ డే, డాటర్స్‌ డే అంటూ ఏదో పేరుతో మహిళకు అగ్రస్థానం ఇస్తామంటూ.. పబ్లిసిటీ చేస్తుంటారేకానీ.. వారికి సరైన న్యాయం జరగడంలేదని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంటోంది. నటి భావన కిడ్నాప్‌ ఉదంతంపై ఆమె పైవిధంగా స్పందించింది. ఆమెతో చిట్‌‌చాట్‌.
 
భావన ఉదంతంపై మీ స్పందన ఏమిటి?
మహిళలకు గౌరవం పేపర్లో రాయడానికి టీవీలో చూపించడానికి మినహా.. పెద్దగా చేసిందేమీలేదు. భావన విషయంలో తీవ్రమైన పనిషిమెంట్‌ ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి మళ్ళీ జరగవు.
 
మీకే గనుక ఇలాంటి సంఘటన ఎదురైతే ఏం చేస్తారు?
అమ్మ ఎప్పుడూ జాగ్రత్తలు గురించి చెబుతుంటూంది. నాకు సెక్యూరిటీ వుంది. నా సోదరుడు ఎప్పుడూ నాతోనే వుంటాడు. నాకూ డ్రైవర్‌ వున్నాడు.. మేం నటులం. మమ్మల్ని టచ్‌ చేస్తే న్యూస్‌ అవుతుంది. అది తెలిసి కూడా సంఘటనలు జరుగుతూనే వుంటాయి.   సీరియస్‌ పనిష్‌మెంట్‌ లేకపోతే... ఇలానే వుంటాయి..
 
మీకు కూడా సిమ్లాలో ఓ సంఘటన జరిగింది కదా?
సిమ్లాలో షూటింగ్‌ జరుగుతుండగా.. ఓ వ్యక్తి తెలీకుండా ఫొటోలు తీస్తున్నాడు. వారించాను. వినలేదు. ఒక కిక్‌ ఇచ్చా. తనూ కొట్టాడు. అయితే అవేమంత సీరియస్‌ కిక్‌లు కాదు. కానీ ఇలాంటివి జరగ్గకుండా వెంటనే అక్కడివారిని కంట్రోల్‌ చేశారు.
 
షూటింగ్‌లో బిజీగా వున్నారు. పర్సనల్‌ లైఫ్‌ మిస్‌ అవ్వడంలేదా?
ఎంత బిజీగా వున్నా.. మైండ్‌ పీస్‌పుల్‌గా వుంచుకోవాలి. రోజువారి ప్లానింగ్‌ చేసుకోవాలి. ఈవెనింగ్స్‌ షూటింగ్‌ వుండవు. ఆ సమయంలో నా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్‌తోనూ గడుపుతా.
 
సినిమా ఫ్రెండ్సా, లోకల్‌ ఫ్రెండ్సా?
మామూలు ఫ్రెండ్స్‌తోపాటు సినిమా ఫ్రెండ్స్‌ వున్నారు. రాశిఖన్నా, రెజీనా, రానా, సందీప్‌, సాయిధరమ్‌ తేజ్‌.. వీరితో వీలున్నప్పుడు అలా బయటకు వెళ్ళి వస్తుంటాం.
 
ఔటింగ్‌కి ఎక్కడికి వెళుతుంటారు?
నాకు ఎక్కువగా రెస్టారెంట్స్‌కు వెళ్ళాలంటే ఇష్టం. కొత్త రెస్టారెంట్‌ వచ్చింది అని తెలిస్తే వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అక్కడున్న ఫుడ్‌ను తినేయాలనిపిస్తుంది. అది లేనినాడు ఈవినింగ్స్‌ షాపింగ్‌మాల్స్‌కు వెళుతుంటా.
 
మామూలుగానే వెళతారా? ముసుగువేసుకుని వెళతారా?
మామూలుగానే వెళతాను. నన్ను గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు అక్కడే వుండనుగదా.. పైగా ఫ్రెండ్స్‌తో వుండేసరికి నన్ను నేను కవర్‌ చేసుకున్నట్లుగా వుంటుంది.
 
మీకు వంట వచ్చా?
పెద్దగా రాదు. వంటమనిషి వండేస్తుంది. నాకు బాగా వచ్చింది. గుడ్లు ఉడకపెట్టడం. చిన్న క్రాక్‌ రాగానే తీసేసి తినేస్తా.
 
భవిష్యత్‌లో రెస్టారెంట్‌ బిజినెస్‌ పెట్టే ఆలోచన వుందా?
ఇంతవరకు అనుకోలేదు.
 
నిర్మాతగా మారే అవకాశం వుందా?
నాకు చాలామంది నిర్మాతలే సలహాలు కూడా ఇచ్చారు. డోంట్‌ గో దట్‌ సైడ్‌.. అని.. నిర్మాతగా కష్టాలు తెలిసికూడా ఎలా వెళ్ళగలను అని చెప్పారు.