గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By డివి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:50 IST)

అల్లు అర్జున్ అంటే ఇష్టం, శ్రీదేవి బయోపిక్ ఛాన్స్ వస్తే చేస్తా: అమ్రిన్ ఖురేషి

సావిత్రి, శ్రీ‌దేవి మేడ‌మ్ అంటే నాకు చాలా ఇష్టం. వారి ఇన్స్‌పిరేష‌న్‌తోనే యాక్టింగ్ నేర్చుకున్నాను. అని హైద‌రాబాద్ బ్యూటీ అమ్రిన్ ఖురేషి తెలిపింది. రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న పక్కా హైదరాబాదీ ఆమె. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ' చిత్రాన్ని 'బ్యాడ్‌బాయ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెట‌రన్ హీరో మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి స‌ర‌స‌న హీరోయిన్‌గా అమ్రిన్‌ న‌టిస్తోంది. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుద‌ల‌కానుంది. ఈ మూవీ సాంగ్ షూట్‌లో పాల్గొన‌డానికి హైద‌రాబాద్‌కి వ‌చ్చింది . ఈ సంద‌ర్భంగా ఆమెతో జ‌రిపిన ఇంట‌ర్వూ.
 
హైద‌రాబాద్‌తో మీకున్న అనుబంధం?
నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. శివ శివాని పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నా. ఆ త‌ర్వాత‌ ముంబయిలో యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు హీరోయిన్‌గా `బ్యాడ్‌బాయ్`లోని పాట చిత్రీకరణకు హైద‌రాబాద్‌ రావ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. తెలుగు హిట్‌ చిత్రం ‘సినిమా చూపిస్తమావ’కు హిందీ రీమేకిది. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకుడు. అలాగే `జులాయి` రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఈ రెండు సినిమాల్లోనూ మిథున్‌ చక్రవర్తిగారి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా న‌టిస్తున్నారు.  
 
మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు క‌లిగింది?
నేను చ‌ద‌వుకునే రోజుల్లో పెద్ద‌య్యాక బిజినెస్ చేయాలి అనుకునేదాన్ని కాని యాక్టింగ్ అనేది స‌బ్‌కాన్షియ‌స్‌గా నా మైండ్‌లో ఉండడం వ‌ల్ల‌నో ఏమో నాక యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందుకే యాక్టింగ్‌ని నా ప్రొఫెష‌న్‌గా ఎంచుకున్నాను. ముంబైలో ట్రైనింగ్‌ పూర్తయ్యాక 'బ్యాడ్‌బాయ్‌' సినిమాలో హీరోయిన్‌ కోసం ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసి నేను నా ఐడెంటిటీ గురించి చెప్పకుండానే ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఆడిషన్స్‌లో నేనెంటో ప్రూవ్‌ చేసుకోవడంతో నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
తెలుగు రీమేక్స్ బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్ అయ్యాయి క‌దా! మీ మూవీస్ పై కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారా?
త‌ప్ప‌కుండా రెండు చిత్రాల విష‌యంలోనూ చాలా  కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆ రెండు మూవీస్ తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ` అలాగే `జులాయి` చిత్రాల‌కు రీమేక్స్‌. ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు మూవీ రీమేక్స్‌లో న‌టించ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. రెండు సినిమాల్లో కూడా అక్క‌డి ట్రెండ్‌కు తగ్గ‌ట్లు క‌థ‌లో చిన్న చిన్న చేంజెస్ చేయ‌డం జ‌రిగింది.
 
మీరు బాలీవుడ్ సినిమాలంటే ఇష్ట‌ప‌డ‌తారా లేదా టాలీవుడ్ సినిమాలా?
నేను చిన్న‌ప్ప‌టి నుంచి చాలా తెలుగు మూవీస్ చూస్తూ పెరిగాను. తెలుగులో నా ఫేవ‌రేట్ మూవీస్ చాలా ఉన్నాయి. అలాగే బాలీవుడ్ మూవీస్ కూడా ఇష్ట‌మే..
 
మీకు యాక్టింగ్‌లో ఇన్స్‌పిరేష‌న్ ఎవ‌రు‌?
సావిత్రి గారు, అలాగే శ్రీ‌దేవి మేడ‌మ్ అంటే నాకు చాలా ఇష్టం. వారి ఇన్స్‌పిరేష‌న్‌తోనే యాక్టింగ్ నేర్చుకున్నాను.
న‌ము‌షి చ‌క్ర‌వ‌ర్తితో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపిస్తోంది?
న‌ముషి మిథున్ చ‌క్ర‌వ‌ర్తి గారి అబ్బాయి, గ్రేట్ కో స్టార్‌. చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. డ‌బ్బింగ్‌, సాంగ్స్ విష‌యంలో నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. రెండు సినిమాల్లోనూ న‌ముషితో క‌లిసి వ‌ర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను.
 
తెలుగులో అవ‌కాశం వ‌స్తే ఏ హీరోతో న‌టించాలి అనుకుంటున్నారు?
అంద‌రి హీరోల సినిమాలు చూస్తూ ఉంటాను. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ‌రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలా  అంద‌రి హీరోల‌తో న‌టించాల‌ని ఉంది. కానీ.. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌, డ్యాన్స్ అంటే ఇష్టం.
మీకు అవ‌కాశం వ‌స్తే శ్రీ‌దేవిగారి బ‌యోపిక్‌లో న‌టిస్తారా?
ప్ర‌స్తుతానికి కేరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. న‌టిగా న‌న్ను నేను నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. శ్రీ‌దేవి గారి బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అది నాకు చాలా పెద్ద రెస్పాన్సిబులిటి అవుతుంది.
 
హింది సినిమాలు ఇక్క‌డ కూడా రిలీజ్ అవుతాయి క‌దా ఇక్క‌డి ప్రేక్ష‌కులకి ఏం చెప్తారు?
నాకు హైదరాబాద్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. ఇక్కడ స్నేహితులు, బంధువులు చాలా మంది ఉన్నారు. తెలుగులో సినిమా చేయ‌డానికి చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఇక్క‌డ కూడా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నేను న‌టిస్తున్న రెండు సినిమాల‌కి మీ బ్లెసింగ్‌స్ ఉండాల‌ని కోరుకుంటున్నాను.