'నాగ'లో రాజనాగం... లారెన్సా? జ్యోతికనా?
కోలీవుడ్‌లో హర్రర్ చిత్రాల టెండ్ర్ కొనసాగుతోంది. దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మల నేపథ్యంతో వస్తున్న సినిమాలకు ఆదరణ ఎక్కువ. తమిళ చిత్రాల డబ్బింగ్, రీమేల పుణ్యమా అంటూ తెలుగులో కూడా హర్రర్ చిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. రాఘవ లారెన్స్ తాజాగా 'నాగ' చిత్రంలో మరో సారి భయపెట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఒక్కప్పుడు క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన బ్యూటీ, హీరో సూర్య సతీమణి జ్యోతిక పెళ్లి, పిల్లలూ అంటూ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇటీవల '36 వయదినిలే' చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ స్థితిలో వేందన్ మూవీస్ కోసం డైరెక్ట్ చేసి, నటిస్తున్న లారెన్స్ 'నాగ' చిత్రంలో జ్యోతికను నటింపచేయాలని చూస్తున్నారట.
జ్యోతిక వద్ద లారెన్స్ నాగ చిత్ర కథ గురించి తెలుపగా, ఆమె సానుకూలంగా స్పందించిందట. ముని, కాంచన, గంగ సీక్వెల్‌లో వస్తున్న 'నాగ' చిత్రంలో రాజనాగంగా నటించే ప్రధాన పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్రలో నటించాలని జ్యోతికను లారెన్స్ కోరారట. అయితే జ్యోతికా సమాధానం చెప్పాల్సి ఉంది. కాగా గతంలో 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక నటన ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. మరి 'నాగ'లో జ్యోతిక నటిస్తే హిట్టు తప్పనిసరి అని కోలీవుడ్ టాక్.