సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (09:07 IST)

నిలకడైన బ్యాటింగ్‌తో విజయలక్ష్యానికి చేరువగా పుణే సూపర్ జెయింట్స్.. 11 ఓవర్లలో ఒక వికెట్‌కు 65 పరుగులు

ఆదివారం రాత్రి ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్‌-10 ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో భారీ షాట్లక

ఆదివారం రాత్రి ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్‌-10 ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్‌ తీసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 11  ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి పుణె 65 పరుగులు చేసింది. రహానె(43), స్మిత్‌(13) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(3).. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వికెట్ కోల్పోకుండా ఆచి తూచి ఆడుతున్న రహానె, స్మిత్ దాదాపుగా పుణె సూపర్ జెయింట్ విజయాన్ని ఖరారు చేసేవిధంగా ముందుకు సాగుతున్నారు. 
 
ఈ ఫైనల్ అరుదైన సన్నివేశానికి వేదికగా నిలుస్తోంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఏడవ ఫైనల్ ఆడుతున్న తొలి ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన విజయంతో చరిత్ర సృష్టించనున్నాడు.