రోహిత్ శర్మ భార్య రితికాతో టేబుల్ టెన్నిస్ ఆడాడు.. చివర్లో షాట్ కొట్టి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ జరుగుతుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-10లో పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ జరుగుతుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-10లో పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌లో ఉన్న రోహిత్ శర్మ టీమ్.. సోమవారం రైజింగ్ పుణెతో తలపడనుంది. కాగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడుతూ, ముంబైకి కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఖాళీ సమయాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతున్నాడు.
తాజాగా తన భార్య రితికాతో టేబుల్ టెన్నిస్ ఆడాడు. అయితే భార్యపై నెగ్గేందుకు మల్లగుల్లాలు పడాల్సి వచ్చిందని తెలిపాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు. భార్యతో ఆడిన రోహిత్ శర్మ చివర్లో ఊహించని షాట్ కొట్టి.. సతీమణిపై నెగ్గాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశాడు. తన భార్యకు టీటీలో శిక్షణ ఇస్తున్నానని తెలిపాడు.