నెట్టింట వైరల్ అవుతున్న ఐపీఎల్ పాట.. (VIDEO)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచీ నవంబర్ 10 వరకు జరగనుంది. ఈ టోర్నీ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లానే బీసీసీఐ ఈ ఏడాది కూడా ఐపీఎల్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
'ఆయేంగే హమ్ వాపస్' పేరుతో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరోనాపై విజయం సాధించింది భారత్‌లో మళ్లీ ఐపీఎల్ జరుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచీ నవంబర్ 10 వరకు జరగబోయే ఈ టోర్నీ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లానే బీసీసీఐ ఈ ఏడాది కూడా ఐపీఎల్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది.