శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (17:20 IST)

ఐపీఎల్ 2020 : సరికొత్త రికార్డు నెలకొల్పిన ముంబై - చెన్నై మ్యాచ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2020 టోర్నీలో భాగంగా గత శనివారం రాత్రి అబుదాబీ వేదికగా ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. 
 
అయితే, క్లోజ్‌డ్ డోర్స్ మధ్య జరిగిన టోర్నీలోని తొలి మ్యాచ్ రికార్డులకెక్కింది. 19న చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారట. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఆరంభ మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ రాలేదట.
 
ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 కోట్ల మంది వీక్షించినట్టు బీసీసీఐ కార్యదర్శి జే షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ప్రపంచంలో మరే లీగ్‌కూ ఇంతటి ఆదరణ దక్కలేదని గుర్తుచేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెల్సిందే.