ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (15:40 IST)

యూట్యూబ్ ద్వారా ఒకే ఏడాది రూ.185 కోట్లు.. ఆ బాలుడెవరో తెలుసా?

అమెరికాకు చెందిన రియాన్ ఖాజీ అనే ఎనిమిదేళ్ల బాలుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా 2019వ సంవత్సరం రూ. 185 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు. గత 2015వ సంవత్సరం రియాన్స్ వరల్డ్ అనే పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ ఛానల్ 2.2 కోట్ల సబ్‌స్క్రైబర్లను కలిగివుంది. ఈ ఛానల్‌లో ఆడుకునే వస్తువులను ఉపయోగించే రియాన్ వీడియో విడుదల చేశాడు. 
 
ఈ నేపథ్యంలో 2019వ సంవత్సరం అధిక ఆదాయం ఆర్జించిన ఫోర్బ్స్ జాబితాలో రియాన్‌కు స్థానం దక్కింది. తద్వారా ఎనిమిదేళ్ల వయస్సులో అత్యధిక ఆదాయం ఆర్జించిన జాబితాలో రియాన్ అగ్రస్థానంలో నిలిచాడు. గత 2018వ సంవత్సరం 22 మిలియన్ల అమెరికా డాలర్లను సంపాదించి రియాన్ అగ్రస్థానంలోనూ నిలిచాడు.