ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:56 IST)

అమాజ్‌ఫిట్ నుంచి ఏఐ టెక్నాలజీ చీతా సిరీస్ స్మార్ట్‌వాచ్

Amazfit Cheetah series
Amazfit Cheetah series
అమాజ్‌ఫిట్ సంస్థ చీతా సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను భారతదేశంలో ప్రారంభించింది. చీతా సిరీస్, పేరుకు తగినట్లుగా, రన్నర్స్ కోసం రూపొందించబడింది. ఏఐ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. 
 
చీతా సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు లైట్ వెయిట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ మిడిల్ ఫ్రేమ్‌ను అందిస్తాయి. కస్టమర్లు రోజంతా వాచ్‌ని ధరించడానికి సౌకర్యంగా ఉండేలా మెటీరియల్‌తో ఉపయోగించబడింది.
 
జూన్‌లో ప్రకటించినట్లే అమాజ్‌ఫిట్ చీతా సిరీస్‌తో ఎలైట్-లెవల్ రేసుల కోసం కఠినంగా శిక్షణ పొందిన రన్నర్లు ఉపయోగించుకోవచ్చు. Amazfit Cheetah సిరీస్ ధర రూ.20,999. ఇది ఒకే స్పీడ్‌స్టర్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండగా, స్మార్ట్‌వాచ్ రౌండ్, స్క్వేర్ ఆకారాలలో వస్తుంది.