మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (18:00 IST)

ఎయిర్‌టెల్ నుంచి మరో ఆఫర్.. ఏంటిది?

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. తమ ఖాతాదారులకు వింక్‌ మ్యూజిక్‌ యాప్ భాగస్వామ్యంతో ఉచితంగా హలో ట్యూన్స్‌ అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 
 
ప్రతి నెల రోజులకు కనీసం రూ. 129 లేదా అంతకుమించి బిల్లింగ్ చేసే పోస్ట్ పెయిడ్‌ లేదా ప్రీపెయిడ్‌ ఖాతాదారులు ఈ ఉచిత ట్యూన్స్‌ ఆఫర్‌ ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ ప్రోగ్రామ్‌ కింద ఈ ఉచిత ట్యూన్స్‌ అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. 
 
ఈ ఆఫర్ క్రింద వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ లైబ్రరీలో ఉండే నాలుగు కోట్లకుపైగా పాటల్లో ఏ పాటనైనా ఖాతాదారులు ఎంచుకోవచ్చు. ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఇంతకు ముందు ఈ హలో ట్యూన్స్‌ కోసం ఖాతాదారులు, నెలకు రూ. 36 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. 
 
తెలుగు, హిందీతో సహా 15 భాషల్లో ఈ పాటలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఖాతాదారులు లేటెస్ట్‌ వెర్షన్‌ వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని హల్లో ట్యూన్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలని ఎయిర్‌టెల్‌ తెలిపింది.