కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

airtel
కుమార్| Last Updated: సోమవారం, 20 మే 2019 (16:57 IST)
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో రిలయన్స్ జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికాం కంపెనీలు మూతపడగా, జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని తమ ఖాతాదారులు చేజారిపోకుండా ఎయిర్‌టెల్ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లపై 1000 జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ ఆఫర్ గడువు మార్చి 31తోనే ముగిసింది, అయితే కస్టమర్‌ల కోసం దీనిని మరింతకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ క్రింద ఎయిర్‌టెల్ ఖాతాదారులకు రూ.799 ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 500 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది.

రూ.999 ప్లాన్‌లో 250 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 1000 జీబీ డేటా లభించనుంది. రూ.1,299, రూ.1999 ప్లాన్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 999 ఆపై ప్యాక్‌లపై డేటా రోలోవర్ సౌకర్యం కూడా ఉన్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.దీనిపై మరింత చదవండి :