శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (15:59 IST)

ఒక్క నెలలోనే.. రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్ల ఉత్పత్తి

Apple
ఒక్క నెలలోనే రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ భారత్‌కు ఎగుమతి చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి పెరిగింది. ఒక్క భారత్‌లోనే తయారైన ఐఫోన్‌ల విలువ రూ.8,100 కోట్లుగా ఉందని తెలిపింది. 
 
గత నెల రోజుల్లోనే రూ.పదివేల కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఎగుమతి కాగా, అందులో రూ. 8,100 కోట్లు మాత్రమే ఐఫోన్ల ద్వారా ఎగుమతి అయ్యాయి. 
 
2025 నాటికి ప్రపంచంలో వాడే ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని, 2027 నాటికి ప్రపంచంలో వాడే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతాయన్నారు.