శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (09:07 IST)

'రీచార్జ్ ట్యూబ్' యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారో...

పెరుగుతున్న సాంకేతి టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతివాటం కూడా పెరిగిపోతోంది. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. బ్యాంకు లేదా డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఏదో విధంగా బురిడీ కొట్టిచి వారి ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజేచేస్తున్నారు. తాజాగా ఓ సైబర్ నేరగాడు.. ఏకంగా రూ.3.94 లక్షలను క్షణాల్లో మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్‌ చేశాడు. 
 
వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్‌ ట్యూబ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ముందుగా రూ.10తో మొబైల్‌ నెంబర్‌కు రీచార్జ్‌ చేయాలని సూచించగా అదేవిధంగా చేశాడు. కొంత సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ.3.94 లక్షలు వేరే ఖాతాకు బదిలీ కావడంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.