సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (13:27 IST)

బ్లూటిక్ ఫీజు పెంపుపై మీమ్స్.. తగిన సేవలు పొందుతారంటూ మస్క్ వివరణ

elon musk
ట్విట్టర్ సంస్థను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కంపెనీ విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆ కంపెనీలో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే, బ్లూటిక్ ఫీజును పంచారు. 
 
ఇక నుంచి ట్విట్టర్ హ్యండిల్‌కు బ్లూటిక్ కావాలంటే 8 డాలర్లు చెల్లించాలన్న షరతు విధించారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. పైగా, ఈ ఫీజుకు తగిన సేవలు పొందుతారంటూ వివరణ ఇస్తున్నారు. 
 
నెల నెల 8 డాలర్లు చెల్లించడం ద్వారా ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్ బ్యాడ్జిని కలిగి ఉండొచ్చని, స్పామ్ సందేశాల గొడవ ఉండదని చెప్పారు. ప్రకటనల విషయంలోనూ వెరిఫైడ్ ఖాతాలకు మిగితా వారికి లేని ప్రయోజనాలు కల్పిస్తామని మస్క్ వివరించారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే బ్లూటిక్ యూజర్లు సగం ప్రకటనలు మాత్రమే చూస్తారని ఎలాన్ మస్క్ ఆయన చెప్పుకొచ్చారు.