మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (14:13 IST)

కొత్త కృత్రిమ మేధస్సు సంస్థను ప్రారంభించనున్న ఎలాన్ మస్క్

elon musk
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తుతం కొత్త కృత్రిమ మేధస్సు సంస్థను ఏర్పాటు చేయనున్నారు. మస్క్ తన ఏఐ సంస్థను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా చెప్తోంది. నెవాడాలో కేంద్రంగా పనిచేయనున్న ఈ కొత్త కంపెనీలో మస్క్‌ ఏకైక డైరెక్టర్‌‌గా వున్నారు. ఆయన కుటుంబ కార్యాలయాల డైరెక్టర్ జారెడ్ బిర్చాల్‌ను కార్యదర్శిగా పేర్కొంటు ఈ సంస్థ రిజిస్టర్ అయింది.
 
కాగా, కృత్రిమ మేథస్సు (ఏఐ) అభివృద్ధి గురించి గతంలో మస్క్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్.ఏఐ కార్ప్ అనే కొత్త కృత్రిమ మేధస్సు కంపెనీకి మస్క్ నాయకత్వం వహించడానికి శాస్త్రవేత్త ఇగోర్ బాబూస్కిన్‌తో సహా ఇద్దరు మాజీ పరిశోధకులను నియమించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.