ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (20:08 IST)

నిఘా అనేది పెనుముప్పు.. ఇకపై ఫేస్ బుక్ నిబంధనలు కఠినతరం..

ఫేస్ బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకుంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. దీంతో

ఫేస్ బుక్ నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకుంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. దీంతో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్న సమాచారాన్ని సేకరించి.. దాని ఆధారంగా నిఘా పెట్టేందుకు సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది.  
 
తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పేందుకుగాను ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకొనేవాళ్ళకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది. 
 
అయితే ఇప్పుడు ఇలా ఫేస్ బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తి నిషేధించినట్టు ఫేస్ బుక్ వివరించింది. ఫేస్ బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగ్‌లు చేస్తున్నారో పరిశీలించవచ్చు.