ఫేస్‌బుక్ డేటింగ్ యాప్‌తో కనెక్ట్ అయిపోండి...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్ల కోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. నిజానికి ఎల్లవేళలా సరికొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువవుతున్న ఫేస్‌బుక్… ఇపుడు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్ల కోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. నిజానికి ఎల్లవేళలా సరికొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువవుతున్న ఫేస్‌బుక్… ఇపుడు మరో సంచలనానికి తెరతీయనుంది.
టిండర్, ట్రూలీ మ్యాడ్లీ వంటి మొబైల్ డేటింగ్ యాప్‌ల తరహాలో ఫేస్‌బుక్ కూడా ఓ డేటింగ్ యాప్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అమెరికాలో మే నెలలో జరిగిన ఎఫ్8 డెవలపర్ సదస్సు సందర్భంగా… ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ డేటింగ్ యాప్ వివరాలను బహిర్గతం చేశారు.
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో ఫేస్‌బుక్… ఇప్పటికే ఈ డేటింగ్ ప్రాజెక్ట్‌ను టెస్ట్ చేయడం మొదలుపెట్టినట్టు చెప్పారు. యూజర్ల ఫ్రైవసీ, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని డేటింగ్ యాప్‌ను రూపొందించబోతున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. రిమల్, లాంగ్ టర్మ్ రిలేషన్స్‌ను నిర్మించే విధంగా ఈ యాప్ ఉండబోతున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో వెల్లడించారు. త్వరలోనే ఫేస్‌బుక్ డేటింగ్ యాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.