మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:59 IST)

లోవాలోని గూగుల్ డేటా సెంటరులో అగ్నిప్రమాదం

Google
గూగుల్  డేటా సెంటరులో అగ్నిప్రమాదం సంభించింది. లోవాలోని గూగుల్ సెంటరులోని ఓ సెంటరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సెర్చింజన్‌తో పాటు ఇతర సేవలకు కాస్త అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గూగుల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. 
 
అమెరికాలోని లోవాలో కౌన్సిల్ బ్లఫ్‌లో ఉన్న గూగుల్ డేటా సెంటరులో అగ్ని ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యమని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వారికి కావాల్సిన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం ఉదయం యూజర్లకు సెర్చింజన్‌లో సమస్యలు ఎదురయ్యాయి. 
 
సెర్చింజన్ పనిచేయడం లేదంటూ సుమారు 40 వేల మందికి పైగా ఫిర్యాదులు చేశారు. '502 ఎర్రర్' కనిపిస్తూ.. 30 సెకన్ల తర్వాత ప్రయత్నించండంటూ వారికి సందేశం కనిపించింది. సర్వరులో ఏర్పడిన ఈ సమస్యను గూగుల్ ఇంజనీర్లు తక్షణం పరిష్కరించి సేవలను పునరుద్ధరించారు.