శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (21:59 IST)

5 నిమిషాల ముందు కూడా రైల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు... ఎలా?

Rail ticket
రైలు ప్రయాణం చేసేవారు చాలామంది తమకు రిజర్వేషన్ దొరక్క తమ ప్రయాణాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో చేస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ ప్రవేశపెట్టిన సౌకర్యం ఎంతో ఉపకరిస్తుంది. ఇందుకోసం https://www.irctc.co.in/online-charts/ అనే లింక్ పైన క్లిక్ చేసి బోగీల్లో వున్న ఖాళీలను చూడొచ్చు. మీరు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు సంబంధించి ఖాళీ వుంటే వెంటనే బుక్ చేసుకుని రైలులో ప్రయాణం చేయవచ్చు.

 
ఇప్పటికే కరెంట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే అందిస్తోంది. పైన చెప్పుకున్న సౌకర్యం బహుకొద్దిమందికే తెలుసు. ఇకపై ఈ సౌకర్యంతో రైలుబండి కదిలే 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేయవచ్చు.