శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (14:37 IST)

ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో.. ఫ్రెషర్ల జీతాలు పెంచే అవకాశం లేదు..

Wipro
ఉద్యోగులకు టెక్ దిగ్గజం విప్రో షాకిచ్చింది. టెక్ దిగ్గజం విప్రోలో ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్లకు బాధ్యతలు అప్పగించడంలో (ఆన్‌బోర్డింగ్) జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. పనితీరు సరిగా లేదన్న కారణంతో విప్రోలో కొందరు ఫ్రెషర్లను తొలగించారన్న వార్త కూడా వైరల్ అయ్యింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రెషర్ల జీతాలు పెంచే అవకాశం లేదని సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి సౌరభ గోవిల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది విప్రో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపట్టని విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇప్పటికే ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని ఉద్యోగంలోకి తీసుకుకోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అన్నారు.