1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (22:59 IST)

రిటైల్‌ రంగంలోకి గూగుల్- మొబైల్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎలక్ట్రాన్‌ సేల్స్ ప్రారంభం

అంతర్జాలంలో దిగ్గజ సంస్థగా దూసుకుపోతున్న గూగుల్‌ సంస్థ తాజా రిటైల్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే న్యూయార్క్‌లోని ఛెల్సియా ప్రాంతంలో ఈ నెల 17న రిటైల్‌ స్టోర్‌ ప్రారంభించింది. మొబైల్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎలక్ట్రాన్‌ వేరబ్లేస్‌ ఉత్పత్తాధనల కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ప్రారంభిస్తున్న ఈ రిటైల్‌ స్టోర్స్‌ను క్రమంగా ఇతర ఉత్పాధనలకూ విస్తరింపజేస్తారు. 
 
గూగుల్‌ ఇదివరకు 'పాప్‌ అప్‌' దుకాణాలను నిర్వహించింది. అవి సత్ఫలితాలను ఇవ్వడంలో ఇప్పుడు ఏకంగా రిటైల్‌ స్టోర్లను తెరిచేస్తోంది. న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌ శాశ్విత ప్రాతిపదికన ఏర్పాటు చేసింది కావడం విశేషం. ఈ కొత్త స్టోర్‌లో గూగుల్‌ సేవలతో పాటు, పిక్సెల్‌ ఫోన్లు, నెస్ట్‌ ఉత్పాదనలు, అలాగే ఫిట్‌బిట్‌ వేరబ్లేస్‌, పిక్సెల్‌ పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు.