శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (12:10 IST)

ఫోన్‌లో జోకర్‌ మాల్‌వేర్‌ ఉంటే అంతే సంగతులు!

స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారా? అయితే జోకర్ మాల్‌వేర్‌తో ప్రమాదమే పొంచి ఉంది. ఫోన్‌లో జోకర్‌ మాల్‌వేర్‌ ఉంటే అంతే సంగతులు అంటున్నారు ఐటీ నిపుణులు. ప్లేస్టోర్‌లోని యాప్‌లే లక్ష్యంగా జోకర్ మాల్ వేర్ దాడి చేస్తోంది. జులై నెలలో ప్లేస్టోర్‌లోని 11 యాప్‌లపై, సెప్టెంబరు మొదటి వారంలో ఆరు యాప్‌లలో ఈ మాల్‌వేర్‌ ఉన్నట్లు గుర్తించారు. 
 
తాజాగా మరో 17 యాప్‌లలో జోకర్ ఉన్నట్లు తెలియడంతో వాటిని కూడా ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. మొత్తం జోకర్‌ మాల్‌వేర్‌ కారణంగా.. 34 యాప్‌లను తొలగించింది ప్లేస్టోర్. జోకర్‌ మాల్‌వేర్, యాప్‌ల ద్వారా యూజర్స్‌ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. 
 
తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా అనవసరమైన పలు రకాల ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంది. ఇందుకోసం చిన్న చిన్న కోడ్‌లను ఉపయోగించి గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌కి దొరకకుండా పని పూర్తి చేస్తుంది.