గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (10:38 IST)

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సేవలు.. డెబిట్, క్రెడిట్ కార్డులతో..?

G Pay
గూగుల్ పే యాప్ నుంచి కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకునే అవకాశం వుంటుంది. ఫలితంగా ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. ఎస్‌బీఐ కార్డులను గూగుల్ పే ప్లాట్‌ఫామ్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది.
 
అంటే గూగుల్ పే, ఎస్‌బీఐ‌ల భాగస్వామ్యం నేపథ్యంలో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్‌లోని ‘గూగుల్ పే’ యాప్ ద్వారా కార్డు చెల్లింపులను మూడు పద్ధతుల్లో చేయొచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) వెసులుబాటు ఉన్న పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) టర్మినళ్ళ వద్ద ట్యాప్ అండ్ పే దుకాణాలు, సంస్థల్లో భారత్ క్యూఆర్ కోడ్ స్కానింగ్, క్రెడిట్ కార్డు, ఇతరత్రా కార్డులు భౌతికంగా అవసరంలేకుండానే ఆన్‌లైన్ చెల్లింపులు ఇలా మూడు రకాలుగా చెల్లింపులు చేయొచ్చు.
 
గూగుల్ పే వినియోగదారులు ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలను మాత్రమే నిర్వహించేందుకు వీలుంది. అయితే ఇప్పుడు గూగుల్ పే ద్వారా నేరుగా కార్డుతో కూడా లావాదేవీలను నిర్వహించడానికి వీలుంటుంది. ఇందుకుగాను ఎస్‌బీఐ కార్డును గూగుల్ పే యాప్‌తో సంధానించుకోవాల్సి ఉంటుంది.