గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (15:14 IST)

క్రాష్ అయిన స్మార్ట్ ఫోన్ నుంచి డేటా రికవరీ ఎలా?

ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ ఫోన్లు ఒక్కోసారి క్రాష్ అవుతుంటాయి. దీంతో అందులోని డేటా మొత్తం పోతుంది. ఇలాంటి సమయంలో డేటా రికవరికీ ఏమైనా అవకాశం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తే, 
 
సహజంగా చాలా ఫోన్లలో ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 32జిబి నుండి 64జిబి వరకూ ఉంటుంది. ఫ్యాక్టరీ రీసెట్‌ చేసినా, కొత్తగా రామ్‌ ఫ్లాష్‌ చేసినా అప్పటివరకు ఉన్న డేటా పార్టీషన్‌ తొలగించబడి మళ్లీ అందులో డేటా కొత్తగా రైట్‌ చేయబడుతుంది. 
 
ఇలా పోయిన డేటా మీద మళ్లీ కొత్త డేటా రైట్ అయినప్పుడు, పాత డేటా రికవర్‌ అయ్యే అవకాశాలు దాదాపు తగ్గిపోతాయి. దీనికి కారణం నాండ్‌ రామ్‌లో పాత డేటా ఓవర్‌ రైట్‌ చేయబడుతుంది. ఒకవేళ అదృష్టం బాగుంటే డేటా రికవరీ, డా.ఫోన్‌ ఆండ్రాయిడ్‌ డేటా రికవరీ వంటి టూల్స్‌ని ట్రై చేసే ఫలితం ఉంటుంది. 
 
వీటిని మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని, డేటా కేబుల్‌ ద్వారా మీ ఫోన్‌ కనెక్ట్‌ చేసి స్కానింగ్‌ చేస్తే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్న డేటా రికవర్‌ అవుతుంది. అయితే వీటిలో చాలా వరకు పెయిడ్‌ వెర్షన్లు మాత్రమే ఉంటాయి.