శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:07 IST)

టెలికాం ధరల యుద్ధం : రూ.109కే ఐడియా ఫ్రీ కాల్స్

టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఆకాశంలో ఉన్న ఫోన్ కాల్ చార్జీలు ఇపుడు సామాన్య పౌరుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ నెలంతా ఉచిత డేటా, కాల

టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఆకాశంలో ఉన్న ఫోన్ కాల్ చార్జీలు ఇపుడు సామాన్య పౌరుడికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ నెలంతా ఉచిత డేటా, కాల్స్‌తో కూడిన ప్లాన్లను రూ.100లోపే ప్రవేశపెట్టడంతో, ఐడియా కూడా ఈ తరహాలోనే రూ.109 పథకాన్ని తాజాగా ప్రకటించింది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ పొందొచ్చు. దీనికితోడు ప్రతిరోజూ 1జీబీ 4జీ/3జీ డేటాను, 100 ఎస్ఎంఎస్‌లను పొందొచ్చు. 
 
కాకపోతే ఈ ప్లాన్‌లో పలు పరిమితులను విధించింది. ఆ ప్లాన్ కాలపరిమితి 14 రోజులు కాగా, ఒక్క రోజులో అన్ని నంబర్లకు కలిపి 250 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవచ్చు. అలాగే, వారంలో వెయ్యి నిమిషాలకు మించి వాడుకోరాదు. ఈ పరిమితి దాటిన తర్వాత ప్రతీ సెకనుకు ఒక పైసా చొప్పున చార్జీ చేస్తారు. 
 
అయితే, ఎయిర్‌టెల్ ఇటీవలే రూ.93 ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో 28 రోజుల వరకు అపరిమిత కాలింగ్ తోపాటు 1జీబీ డేటా సదుపాయం ఉంది. ఇదే ధరకు జియో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అవకాశం కల్పిస్తోంది. ఈ దృష్ట్యా పోటీ కంపెనీలతో పోలిస్తే ఐడియా ప్లాన్ ఏ మాత్రం ఆకర్షణీయంగా లేదనే చెప్పొచ్చు.