ఇన్ఫోసిస్ సీఈవోకు రూ.71 కోట్ల వేతనం చెల్లింపు
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్‌కు భారీ వేతనం చెల్లించారు. 2021-22 సంపత్సరంలో ఆయనకు ఇన్ఫోసిస్ ఏకంగా రూ.71 కోట్ల వేతనం చెల్లించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో ఈ మొత్తం రూ.49.7 కోట్లుగా ఉంది. అంటే కొత్తగా 43 శాతం వేతనం పెంచారు. అదేసమయంలో వచ్చే 2027 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా ఆయన్నే కొనసాగిస్తూ ఇన్ఫోసిస్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
కాగా, గత 2018లో సలీల్ పరేఖ్‌ను ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సీఈవోగా నియమించుకున్న విషయం తెల్సిందే. ఈయనకు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వ్యాపారాలను టర్న్ అరౌండ్ చేయడం, సంస్థలను కొనుగోలు చేయడంతో పరేఖ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. ఈయన తర్వాత ఇన్ఫోసిస్ అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు. ఈయన రూ.37.25 కోట్లు అందుకుంటున్నారు.